E-PAPER

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్.. నాయకత్వాన్ని ప్రశంసించిన ప్రధాని

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వెండితెరపై ‘పవర్ స్టార్’గా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో జనసేనానిగా తనదైన రాజకీయ శైలితో ముందుకు సాగుతున్నారు.

పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అభిమానులు, జనసేన కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పవన్ కల్యాణ్‌కు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపిన శుభాకాంక్షలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన ప్రధాని.. పవన్ కల్యాణ్ నాయకత్వ పటిమను ప్రశంసిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ విషెస్‌తో పవన్ కల్యాణ్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!