ఇంట్లో రోజ్ వాటర్ తయారు చేసుకోవడానికి ముందుగా తాజా గులాబీ రేకులను తీసుకోవాలి. గులాబీ రేకులను శుభ్రంగా కడిగి, ఒక పాత్రలో వేసి అందులో రేకులు మునిగేంత వరకు నీటిని పోయాలి. అనంతరం పాత్రను స్టవ్‌పై పెట్టి తక్కువ మంటపై కొన్ని నిమిషాలు మరిగించాలి. రేకుల రంగు నీటిలోకి బాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
నీరు పూర్తిగా చల్లారిన తర్వాత గులాబీ రేకులను వడకట్టి, ఆ నీటిని శుభ్రమైన గాజు సీసాలోకి తీసుకోవాలి. ఇలా తయారైన రోజ్ వాటర్‌ను ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటే కొంతకాలం తాజాగా ఉంచుకోవచ్చు. అయితే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో తయారు చేసుకున్నది కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ చేయకుండా తక్కువ పరిమాణంలో తయారు చేసుకోవడం మంచిది.
ఈ రోజ్ వాటర్‌ను ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత టోనర్‌గా లేదా ఫేస్ మిస్ట్‌గా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఫేస్ ప్యాక్‌లో కొద్దిగా కలిపి అప్లై చేయవచ్చు. అయితే ప్రతి ఒక్కరి చర్మం ఒకేలా ఉండదు కాబట్టి మొదట కొద్దిగా చర్మంపై పరీక్షించి, ఎలాంటి దురద, మంట లేదా ఎర్రదనం లేకపోతేనే ముఖానికి ఉపయోగించడం మంచిది.








