E-PAPER

పలాస జీడిపప్పుకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం: ఎమ్మెల్యే గౌతు శిరీష


శ్రీకాకుళం జిల్లా పలాస వై7 న్యూస్
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని KVR ఫంక్షన్ హాల్‌లో APEDA ఆధ్వర్యంలో నిర్వహించిన జీడిపప్పు ఎగుమతుల అవగాహన సదస్సు, వర్క్‌షాప్‌లో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పలాస ప్రాంత ఆర్థిక వ్యవస్థకు జీడిపప్పు పరిశ్రమ వెన్నెముకలాంటిదని పేర్కొన్నారు. వేలాది కుటుంబాలకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి, పలాస జీడిపప్పుకు దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.
జీడిపప్పు నాణ్యత ప్రమాణాలు, ఆధునిక ప్రాసెసింగ్ విధానాలు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలు, ఎగుమతి విధానాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా స్థానిక పరిశ్రమను మరింత బలోపేతం చేయవచ్చని అన్నారు.
జీడిపప్పు రైతులు, వ్యాపారులు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పలాస జీడిపప్పుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెంచి, స్థానికంగా ఉపాధి అవకాశాలను విస్తరించి, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి బాటలు వేయడమే తన సంకల్పమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ మల్లా శ్రీనివాస్, APEDA అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ అధికారులు, జీడిపప్పు పరిశ్రమ ప్రతినిధులు, వ్యాపారులు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు, వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!