E-PAPER

పలాస సీహెచ్‌సీలో వైద్య సేవలపై ఎమ్మెల్యే గౌతు శిరీష సమీక్ష

శ్రీకాకుళం జిల్లా పలాస వై7 న్యూస్

పలాస నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పలాస కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ఎమ్మెల్యే గౌతు శిరీష వైద్యాధికారులు, వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వైద్యులు మరియు సిబ్బంది అందుబాటు, మందుల నిల్వలు, రోగుల సమస్యలు తదితర అంశాలపై ఎమ్మెల్యే వివరాలు తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించే పేద, మధ్యతరగతి ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందేలా వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఆసుపత్రిలో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి, వైద్య సదుపాయాల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్యం నా ప్రథమ ప్రాధాన్యత. మెరుగైన వైద్యం అందించడం మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో డీసీహెచ్ విజయలక్ష్మి, సూపరింటెండెంట్ పాపినాయుడు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు, వైద్యులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!