శ్రీకాకుళం జిల్లా పలాస వై7 న్యూస్
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం 24వ వార్డులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, లబ్ధిదారుల జీవితాలకు భరోసా, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని అందించే సంక్షేమ కార్యక్రమమని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.








