సోనీ ఇండియా భారత మార్కెట్లో 115 అంగుళాల (292 సెం.మీ.) BRAVIA 9 II True RGB టీవీని విడుదల చేసింది. దీంతో సోనీ True RGB BRAVIA టీవీల శ్రేణి 55 అంగుళాల నుంచి 115 అంగుళాల వరకు విస్తరించింది. అత్యాధునిక డిస్‌ప్లే టెక్నాలజీ, శక్తివంతమైన ఆడియో, గేమింగ్ ఫీచర్లు, Google TV వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ కొత్త టీవీని తీసుకొచ్చింది.
ఈ BRAVIA 9 IIలో సోనీ అభివృద్ధి చేసిన RGB Backlight Master Drive Pro టెక్నాలజీని ఉపయోగించారు. రెడ్, గ్రీన్, బ్లూ LEDలను స్వతంత్రంగా నియంత్రించడం ద్వారా మరింత సహజమైన రంగులు, లోతైన కాంట్రాస్ట్, మెరుగైన బ్రైట్‌నెస్, స్మూత్ కలర్ గ్రేడేషన్‌ను అందించేలా దీనిని రూపొందించారు. అలాగే X-Wide Angle Pro టెక్నాలజీ కారణంగా స్క్రీన్‌ను వివిధ కోణాల నుంచి చూసినా మంచి విజువల్ అనుభూతి లభిస్తుంది.
ఇక ఈ టీవీలో Luminance Booster Pro, XR Clear Image, XR Contrast Booster 40, Smooth Color Gradation వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. గేమింగ్, సినిమాలు, స్పోర్ట్స్ వంటి కంటెంట్‌ను పెద్ద స్క్రీన్‌పై ప్రీమియం అనుభూతితో చూసేందుకు ఈ టీవీని రూపొందించినట్లు సోనీ తెలిపింది. భారీ 115 అంగుళాల స్క్రీన్‌తో వచ్చిన BRAVIA 9 II ప్రీమియం టీవీ విభాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.









