‘కమిటీ కుర్రాళ్ళు’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తేజస్వి రావు.. ఇప్పుడు తన గ్లామరస్ లుక్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కెరీర్ ప్రారంభంలో పద్ధతైన, హోమ్లీ పాత్రల్లో కనిపించిన ఆమె.. తాజాగా స్టైలిష్ అండ్ బోల్డ్ ఫోటోషూట్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో తేజస్వి తన కెరీర్‌లో కొత్త మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవల తేజస్వి సోషల్ మీడియాలో షేర్ చేసిన బీచ్ ఫోటోషూట్ చిత్రాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గతంలో కంటే భిన్నంగా బోల్డ్ అండ్ గ్లామరస్ అవతారంలో కనిపించిన ఆమె.. తన అందాలను కొత్త స్టైల్‌లో ప్రదర్శించింది. ఒక్కసారిగా మారిన ఈ లుక్‌కు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ, చాలామంది మాత్రం ఆమె గ్లామర్‌ను ప్రశంసిస్తున్నారు.
పద్ధతైన పాత్రలతో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతోనే తేజస్వి తన స్టైల్‌ను మార్చుకుందనే చర్చ కూడా నడుస్తోంది. గ్లామర్ పాత్రలకు తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాన్ని ఈ ఫోటోషూట్స్ ద్వారా దర్శకనిర్మాతలకు ఇస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ కొత్త గ్లామరస్ అవతారం తేజస్వి రావుకు టాలీవుడ్‌లో ఎలాంటి అవకాశాలను తెచ్చిపెడుతుందో చూడాలి.









