మణుగూరు: సింగరేణి సంస్థకు డీప్ సైట్ కేటాయింపు జరగడం పట్ల బీజేపీ నాయకుడు లింగంపల్లి రమేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు, కార్మిక సంఘాల ప్రతినిధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డీప్ సైట్ను సింగరేణి సంస్థకే కేటాయించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.
డీప్ సైట్ కేటాయింపులో కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
సింగరేణి భవిష్యత్తు బలోపేతానికి, కార్మికుల ఉపాధి భద్రతకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని లింగంపల్లి రమేష్ అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.









