ఆధునిక జీవనశైలి, పెరుగుతున్న మానసిక ఒత్తిడి కారణంగా అనేక మంది మహిళలు పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత, క్రమరహిత రుతుక్రమం, నిద్రలేమి, మూడ్ స్వింగ్స్, తీవ్రమైన అలసట వంటి సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వైద్యుల సూచించిన చికిత్స, సమతుల్య పోషకాహారంతో పాటు యోగా సాధన కూడా PCOS నిర్వహణలో సహాయకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడం, శరీరానికి విశ్రాంతి లభించడం, హార్మోన్ల సమతుల్యతకు అనుకూల వాతావరణం ఏర్పడటానికి తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే యోగా ఒక్కటే PCOSకు చికిత్స కాదని గుర్తుంచుకోవాలి. వైద్యుల సలహా మేరకు సరైన చికిత్స, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన వ్యాయామం, తగిన నిద్రతో పాటు యోగాను జీవనశైలిలో భాగం చేసుకుంటే మెరుగైన ఆరోగ్య ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.








