E-PAPER

అమెజాన్ ప్రైమ్‌లోకి కిరణ్ అబ్బవరం.. భారీ వెబ్ సిరీస్‌తో సర్‌ప్రైజ్!

వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోనూ అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రమోషన్ల సందర్భంగా ఆయన అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ భారీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు వెల్లడించారు.

‘డియర్ కామ్రేడ్’ దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ దాదాపు పూర్తయిందని, మరో పది రోజుల్లో మొత్తం చిత్రీకరణ ముగుస్తుందని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే విడుదలైన ‘గువ్వల చెరువు ఘాట్’ ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి స్పందన లభించింది. రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతుండగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధమవుతోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News