E-PAPER

HUAWEI MatePad Air (2026) గ్లోబల్ లాంచ్.. 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో అదిరిపోయే ట్యాబ్లెట్

హువావే తన కొత్త HUAWEI MatePad Air (2026) ట్యాబ్లెట్‌ను గ్లోబల్ మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్‌లో 12-అంగుళాల 2.8K OLED PaperMatte డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, Kirin T93C ప్రాసెసర్, 10100mAh భారీ బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లను అందించింది. ముఖ్యంగా గత మోడల్‌లో ఉన్న LCD డిస్‌ప్లే స్థానంలో OLED ప్యానెల్‌ను అందించడం ఈ ట్యాబ్లెట్‌లో ప్రధాన అప్‌గ్రేడ్‌గా చెప్పొచ్చు.

HUAWEI MatePad Air (2026)లో 12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, P3 వైడ్ కలర్ గామట్, 1200 నిట్స్ HDR పీక్ బ్రైట్‌నెస్, 87 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో ఆకట్టుకుంటుంది. కేవలం 4.6mm అల్ట్రా-స్లిమ్ బెజెల్స్‌తో స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉండగా, PaperMatte కోటింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఈ ట్యాబ్లెట్‌కు కొత్త Kirin T93C ప్రాసెసర్‌ను అందించారు. 8GB లేదా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఆప్షన్‌తో పాటు HarmonyOS 4.3 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. అంతేకాకుండా 6 స్పీకర్ల ఆడియో సిస్టమ్‌తో మెరుగైన సౌండ్ అనుభవాన్ని అందించడంతో పాటు, 10100mAh బ్యాటరీ దీర్ఘకాలిక బ్యాకప్‌ను అందిస్తుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News