స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఇప్పటికే బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’లో నటించిన ఆమె, ఇప్పుడు మరోసారి ‘NBK111’ చిత్రంలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇటీవల విడుదలైన కాజల్ ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించగా, ఆమె పాత్రపై ఆసక్తికర చర్చ మొదలైంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కాజల్ ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారిణిగా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. యాక్షన్, ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన కీలక పాత్రలో ఆమె నటిస్తున్నారని టాక్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ.. తన పాత్ర పూర్తిగా సీరియస్‌గా ఉంటుందని, ఇందులో ఎలాంటి ఫన్నీ ఎలిమెంట్స్ ఉండవని చెప్పడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.
అయితే, కాజల్ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బాలకృష్ణ-కాజల్ మధ్య సాగే కీలక సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని అభిమానులు భావిస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









