E-PAPER

అశ్వాపురం మండల నూతన కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్‌బాబుకు శుభాకాంక్షలు తెలిపిన జూపెల్లి కిరణ్

అశ్వాపురం, జూలై 7 (వై7 న్యూస్): అశ్వాపురం మండలంలోని ఓరుగంటి వీరయ్య భవన్‌లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్‌బాబును ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వై7 తెలుగు న్యూస్ ఛానెల్ సీఈఓ జూపెల్లి కిరణ్ మరియు మైనార్టీ నాయకులు షారుక్ పాషా రమేష్‌బాబుకు శాలువా కప్పి, స్వీట్లు తినిపించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల అభినందనలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధి కోసం ఆయన సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

అనంతరం మాట్లాడిన రమేష్‌బాబు, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కలుపుకొని గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రమేష్‌బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News