పలాస, జూన్ 24 (వై7 న్యూస్):
మందస మండలంలోని కలింగదళ రిజర్వాయర్ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు కీలక చర్యలు చేపట్టారు. గత 15 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి కాలువల పూడికతీత పనులు, మధుముల షట్టర్ల మరమ్మతుల కోసం అభివృద్ధి నిధులు మంజూరు చేశారు. రైతులకు సకాలంలో నీరు అందేలా పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సూచించారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
Post Views: 8








