కంచిలి మండలం పరిధిలోని బూరగం గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది. అనంతపురం నుంచి కాశి యాత్రకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బస్సులో సుమారు 40 మంది యాత్రికులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో డ్రైవర్, గైడ్‌కు స్వల్ప గాయాలు కాగా, మిగతా ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడటంతో స్థానికులు, యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న కంచిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 13








