మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ సమీపంలోని అమృత ఏజెన్సీ HP పెట్రోల్ బంక్‌లో నేడు తూనికలు–కొలతల శాఖ అధికారి మనోహర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
బంకులో వినియోగదారులకు అందుతున్న సౌకర్యాలు, మెజర్‌మెంట్ పరికరాలు, సీల్స్ వంటి అంశాలను నిషితంగా పరిశీలించారు. అనంతరం మెజర్‌మెంట్ బకెట్ ద్వారా కొలతలు పరీక్షించి అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించారు.
ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ఆరోపణల నేపథ్యంలోనే తనిఖీకి వచ్చానని, అయితే బంక్‌లో ఎటువంటి లోపాలు లేవని అధికారి మనోహర్ మీడియాకు తెలిపారు.
Post Views: 181









