గాంధీభవన్లో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సంగటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమానికి ఖైరతాబాద్ జిల్లాకు ఏఐసీసీ అబ్జర్వర్ గా హాజరైన శక్తిసింహ గోయల్ కు పిసిసి అబ్జర్వర్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగమేశ్వర్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు సికింద్రాబాద్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, రోహిన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. నూతన డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ నియమించిన అబ్జర్వర్స్ పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, మేయర్ విజయ లక్ష్మి, బీసీ కార్పోరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్, ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ బాయ్ ,లక్మణ్ యాదవ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితారావు, మరియు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.









