తూప్రాన్ సమీకృత హాస్టల్ భవనంలో మేళ
మండల విద్యాశాఖాధికారి పర్వతి సత్యనారాయణ
తూప్రాన్, వై7 న్యూస్ ఆగస్టు, 11.
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు తూప్రాన్ మండలంలో ఈ నెల 13వ తేదీ బుధవారం రోజున ఉదయం 9.00 గంటల నుండి బాలుర సమీకృత వసతి గృహం తూప్రాన్ నందు బోధనాభ్యసన సామగ్రి మేళా నిర్వహించుకోవటానికి నిర్ణయించినట్లు తూప్రాన్ మండల విద్యాశాఖ అధికారి పర్వతి సత్యనారాయణ తెలిపారు. కావున ఉపాధ్యాయులందరు విద్యాశాఖ జారీ చేసిన సూచనలను అనుసరిస్తూ, తూప్రాన్ మండలాన్ని అగ్రగామిగా నిలబెట్టుటకు ప్రతీ ఒక్కరు కృషి చేయాల్సిందిగా కోరారు. ఈ క్రింది సూచనలను ప్రతీ ఒక్కరు పాటించాలని సూచించారు. బోధనాభ్యసన సామాగ్రి మేళా మనలో ఉన్న ప్రతిభను ప్రదర్శించటానికి వచ్చిన అవకాశంగా భావించాలి. ప్రతీ ప్రాథమిక మరియు ప్రాథమికొన్నత పాఠశాల నుండి బోధనాభ్యసన సామాగ్రి మేళలో విధిగా పాల్గొనాలి. మేళలో ప్రదర్శించే ప్రతీది తరగతిగది బోధనలో ఉపయుక్తంగా ఉండాలి. వీలైనంత వరకు తక్కువ ఖర్చుతో ఎక్కువగా వినియోగపడేటట్లు ఉండాలి. బోధనాభ్యసన సమాగ్రి తయారిలో అవసరమైన చోట విద్యార్థులను కూడ భాగస్వాములను చేయాలి. ప్రదర్శన సందర్బంగా హాజరైన ఉన్నతాధికారుల సందేహాలను స్పష్టంగా, ఎలాంటి తడబాటుకు అవకాశం లేకుండా వివరించగలిగాలి. ఉత్తమ ప్రదర్శనల ఎంపికకోసం వచ్చిన న్యాయనిర్ణేతలు అన్నింటిని ఉత్తమంగా ఎంపిక చేసే రితీలో మనప్రదర్శనలు కొనసాగాలి. ప్రదర్శనల సందర్బంగా ఎక్కడ కూడ తొణికిసలాటకు తావులేకుండా స్థితప్రజ్ఞతతో అడుగడుగునా మన ధీరోధాత్తతను ప్రదర్శించాలి. ఉదయం 9.00 గంటల నుండి 9.45 గంటల వరకు మీ పాఠశాలకు కేటాయించిన టేబుల్ పై సామాగ్రిని మీకు సౌకర్యంగా ఉండేటట్లు పరిపూర్ణ అమరిక చేసుకోవాలి. ఉదయం 10.00 గంటలకు ముఖ్య అతిథులచే ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 3.00 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుంది. మేళా నిర్వహణలో ఎవరికి అప్పగించిన బాధ్యతలను వారు మాత్రమే నిర్వహించాలి. సంబంధంలేని వ్యక్తులు ప్రవేశించి చేసే పనులకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేయకూడదు. సభా నిర్వహణలో బాధ్యత అప్పగించిన వారు మాత్రమే ఉండాలి. సంబంధం లేని జోక్యం చేసుకుని ఎవరికి తోచిన సలహాలు వారు ఇచ్చే ప్రయత్నం చేయకూడదు, తూప్రాన్ మండలంలో పనిచేస్తున్న ప్రతీ ఉపాధ్యాయునిలో నిభిడికృతమైన రాజసం/హుందాతనం ప్రస్పుటించుటింప చేయుటకు వేదికగా భావించాలీ.పై విషయాలన్ని మీ అందరికీ తెలుసునని భావిస్తున్నాను. ఒకసారి జ్ఞప్తికి తేవటానికి మాత్రమే ప్రయత్నం చేశాను. అందరూ సహృదయంతో స్వీకరించి బోధనాభ్యసన మేళాను ఫలప్రదంగా విజయవంతం చేయుటకు ప్రతీ ఒక్కరు భాగస్వామూల కావాలని ఎం ఈ ఓ పర్వతి సత్యనారాయణ పిలుపునిచ్చారు.









