హైదరాబాద్, సెప్టెంబర్ 10 వై 7 న్యూస్;
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) ఇది ఒక ఏజెన్సీ దీనిని తెలంగాణ ప్రబుత్వం చేత స్థాపించబడింది. ముఖ్యంగా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టి సి యు ఆర్ ) అనగా
( జిహెచ్ఎంసి) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు లోకల్ బాడీస్ అంటే (ఓ. ఆర్. ఆర్) ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ప్రధాన చెరువులు, కుంటలు వాటి అన్నింటిని కూడా టి సి యు ఆర్ పరిది వరకు ఈ యొక్క పని జరుగుతుందనే ప్రజలందరు గమనించాలి . ( ఎఫ్ టి ఎల్ ) ఫుల్ ట్యాంక్ లెవెల్
బఫర్ జోన్ అంటే నియంత్రిత ప్రాంతాలు (హరిత బంధాలు) అని అంటాము . ముఖ్యంగా రెండు ప్రాంతాలను కలిపే ప్రాంతమని కూడా చెప్పుకోవచ్చు .అసలు ఈ బఫర్ జోన్ అనే పేరు ఎక్కువగా రెండు సరిహద్దు దేశాలను కలిపే ప్రాంతాన్ని చూపేందుకు వాడే పదం కానీ ఇక్కడ హైదరాబాద్ లో వున్నా బఫర్ జోన్ అనేది ఏ ఏ రెండు ప్రాంతాల మధ్య ఉండే ప్రాంతాన్ని చూపెడుతుందో ప్రజలకు తెలియజేయాలి ఎఫ్ టి ఎల్ అంటే చెరువు లేదా కుంటలు పూర్తిగా నిండిన మత్తడి పో సె సమయంలో ఎంత భూభాగం వరకు నీరు నిల్వ ఉంటుందో ఆ ప్రాంతం మొత్తాన్ని ఎఫ్ టి ఎల్ అని అర్థమవుతుంది. కానీ బఫర్ జోన్ అంటేనే నాలాల విషయంలోనా లేక మత్తడి ప్రవాహ ప్రాంతాల్లో లేక తూముల ద్వారా నీరు పల్లపు ప్రాంతాలకు వదిలే ఇరువైపులా ఉన్న భూభాగాన్ని చూపెడు తున్నారా అనె విషయంలో బఫర్ జోన్ అనే పదం వాడుతున్నారో రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలియజేయాలి. ఎందుకంటే రాష్ట్ర రాజధాని కాబట్టి వివిధ జిల్లాల నుండి ప్రాంతాల నుండి వచ్చిన వారు ఇల్లు కొనుగోలు చేసే ఉద్యోగ, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు మరియు కార్మికులు కొనుగోలు చేసే ఇల్లు నేల పాలైతే వాళ్ళు ఇక కోలుకునే పరిస్థితులు ఉండక ప్రాణo విలవిలా అయిపోయి గుండె ఆగి పోయినంత పని అవుతుంది కావున రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎఫ్ .టి.ఎల్ అని బఫర్ జోన్ అని మాత్రమే కాకుండా వాటి గురించి పూర్తిగా ప్రజలకు తెలియజేయాలని ఆబాద్ పార్టీ అధ్యక్షుడు హసన్ షేక్ ప్రభుత్వాన్ని కోరా రు