బస్సు ఎక్కే క్రమంలో ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన మల్లేపల్లి వాసి లాలమ్మ
భద్రాచలం | Y7 News Telugu
భద్రాచలం ఆర్టీసీ బస్ డిపోలో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. మణుగూరు డిపోకు చెందిన TS 28 T 2458 నంబరు గల పల్లె వెలుగు బస్సు ముందు చక్రాలు ఓ వృద్ధురాలిపై నుంచి వెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రమాదానికి గురైన మహిళను మణుగూరు మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన మైపా లాలమ్మగా గుర్తించినట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
బస్సు ఎక్కే క్రమంలో ప్రమాదం
స్థానికుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. మల్లేపల్లి నుంచి భద్రాచలం చేరుకున్న లాలమ్మ, అక్కడి నుంచి చర్ల వెళ్లేందుకు పల్లె వెలుగు బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బస్సు ముందు చక్రాలు ఆమెపై నుంచి వెళ్లినట్లు సమాచారం. అయితే ప్రమాదం ఏ పరిస్థితుల్లో జరిగింది? బస్సు కదులుతున్న సమయంలో ఆమె ఎక్కేందుకు ప్రయత్నించారా? లేక డిపోలో రవాణా నియంత్రణలో లోపం ఉందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.








