E-PAPER

మణుగూరులో రేపు విద్యుత్ అంతరాయం

మణుగూరు, సెప్టెంబర్ 27 (Y7 News): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్ 11 కేవీ ఫీడర్‌లో అత్యవసర మరమ్మతు పనులు చేపట్టనున్నందున సెప్టెంబర్ 28న (సోమవారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

విద్యుత్ అంతరాయం కలిగే ప్రాంతాలు:

భగత్ సింగ్ నగర్

గాంధీ నగర్

సురక్ష బస్ స్టాండ్ ఏరియా

కాళీమాత ఏరియా

గోల్డ్ షాప్ లైన్

శేషగిరి నగర్ ప్రాంతాలు

అయితే 33/11 కేవీ గుట్టమల్లారం సబ్‌స్టేషన్ మరియు 33/11 కేవీ మణుగూరు సబ్‌స్టేషన్ పరిధిలోని ఇతర ప్రాంతాలకు ఎటువంటి అంతరాయం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది.

– విద్యుత్ శాఖ, మణుగూరు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!