E-PAPER

పేదలందరికీ గూడు కల్పించడమే లక్ష్యం

పారదర్శకంగానే ఇండ్ల ఎంపిక ప్రక్రియ

లాటరీ ద్వారా 214 మందికి గృహాలు

అణగారిన వర్గాలకు సముచిత ప్రాధాన్యం

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం

కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెం , సెప్టెంబర్ 24 ( వై 7 న్యూస్) ;
పేదలందరికీ గూడు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 29 డివిజన్లకు, 36 మున్సిపల్ వార్డులకు చెందిన ఇండ్లు లేని నిరుపేదలకు లాటరీ పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించే ప్రక్రియ గురువారం స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాతకొత్తగూడెంలో జి-2 నిర్మాణ విధానంలో 23 బ్లాకులుగా మొత్తం 828 ఇండ్లు నిర్మాణదశలో ఉన్నాయని, గతంలో కొందరిని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక జరిగిందని గుర్తుచేశారు. మిగిలిపోయిన 214 మంది అర్హులైన పేదలను ఎలాంటి పక్షపాతం లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రజా సమక్షంలో లాటరీ తీసి కేటాయించినట్లు తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని, మొత్తం 214 ఇండ్లలో 70 ఇండ్లను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులకు ప్రత్యేకంగా కేటాయించామని పేర్కొన్నారు. మిగిలిన 144 ఇండ్లను ఓపెన్ కేటగిరీ కింద పూర్తి నిష్పక్షపాతంగా లబ్ధిదారులకు అందజేశామన్నారు. గూడు లేని నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే బాధ్యతగా పనిచేస్తున్నామని, లాటరీలో ఇండ్లు రానివారికి, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సా పాషా, మేయర్ మూడ్ గణేష్, ప్రజా ప్రతినిధులు వీరబాబు, కొత్వాల శ్రీనివాసరావు, మండే హన్మంతరావు, లలిత కుమారి, కమిషనర్ సుజాత, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!