పలాస, సెప్టెంబర్ 24 (Y7 న్యూస్ తెలుగు): మందస మండలం బైరసారంగిపురం గ్రామానికి చెందిన జినగ మాధవరావుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.30 వేల ఆర్థిక సహాయ చెక్కును పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అందజేశారు. పలాసలోని పార్టీ కార్యాలయంలో ఈ చెక్కును ఆమె స్వయంగా అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యం, అత్యవసర వైద్య పరిస్థితుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు CMRF ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. అర్హులైన బాధిత కుటుంబాలకు వైద్య చికిత్సల కోసం సహాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
పలాస నియోజకవర్గంలో వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన వారి CMRF దరఖాస్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రూ.30 వేల ఆర్థిక సహాయం మంజూరు కావడంపై జినగ మాధవరావు, కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గౌతు శిరీషకు కృతజ్ఞతలు తెలిపారు.








