E-PAPER

ఓఎస్డీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ తనిఖీ

డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్, ఆయుధ విభాగాల పరిశీలన

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 22 (Y7 News Telugu):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మంగళవారం ఓఎస్డీ కార్యాలయాన్ని సందర్శించి పోలీస్ విభాగానికి చెందిన వివిధ విభాగాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్, ఆయుధ కర్మాగారం, వర్క్‌షాప్, వ్యాయామశాల, సిబ్బంది బ్యారక్స్‌లోని సదుపాయాలను ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో సిబ్బందికి అందుతున్న వసతి, పరికరాలు, పరిశుభ్రత, నిర్వహణ తీరును ఎస్పీ పరిశీలించారు. మరమ్మతులు అవసరమైన ప్రాంతాలను గుర్తించి, సిబ్బందికి మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

డాగ్ స్క్వాడ్‌ను పరిశీలించిన ఎస్పీ జాగిలాల ఆరోగ్యం, ఆహారం, వసతి, శిక్షణపై వివరాలు తెలుసుకున్నారు. నేరాల ఛేదనలో జాగిలాల సేవలను సమర్థవంతంగా వినియోగించుకునేలా క్రమం తప్పకుండా శిక్షణ, ప్రాక్టీస్ నిర్వహించాలని సూచించారు.


బాంబ్ డిస్పోజల్ టీమ్ వద్ద ఉన్న పరికరాలు, భద్రతా సామగ్రిని పరిశీలించి, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా సిబ్బంది ఎప్పటికప్పుడు సన్నద్ధంగా ఉండాలని తెలిపారు.

అనంతరం ఆయుధ కర్మాగారం, వర్క్‌షాప్‌ను పరిశీలించిన ఎస్పీ ఆయుధాల నిర్వహణ, మరమ్మతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయుధాలు, ఇతర పరికరాలను సక్రమంగా నిర్వహిస్తూ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

వ్యాయామశాలను పరిశీలించిన ఎస్పీ పోలీసు సిబ్బంది శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. సిబ్బంది బ్యారక్స్‌లో తాగునీరు, పరిశుభ్రత, వసతి సదుపాయాలను సమీక్షించారు.

మరమ్మతులు అవసరమైన ప్రాంతాల్లో వెంటనే చర్యలు చేపట్టి, పోలీసు సిబ్బందికి మెరుగైన వసతి, పని వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలీసు విభాగానికి సంబంధించిన భవనాలు, పరికరాలు, ఇతర వనరుల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఎస్పీ సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!