E-PAPER

మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. సౌదీ వైమానిక రక్షణ బలగాల చర్య

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కా సమీపంలో డ్రోన్ ఘటన చోటుచేసుకుంది. మక్కా నగరానికి సమీపంలోని నిషేధిత గగనతలంలోకి ఓ డ్రోన్ ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. సౌదీ అరేబియా రాయల్ ఎయిర్ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకుని కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు.

సౌదీ నేతృత్వంలోని కూటమి ప్రతినిధి తుర్కి అల్-మాలికి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం డ్రోన్ మక్కా సమీపంలోని నిషేధిత గగనతలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయితే సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ దానిని గుర్తించి, మక్కా నగరానికి చేరకముందే అడ్డుకుని నిర్వీర్యం చేసింది.

ఈ ఘటన అనంతరం మక్కా, జెడ్డా, తైఫ్ నగరాల్లో భద్రతా అప్రమత్తతను పెంచారు. డ్రోన్ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పవిత్ర ప్రాంతాల భద్రతపై సౌదీ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!