E-PAPER

‘డేవిడ్ రెడ్డి’లో రమ్యకృష్ణ పవర్‌ఫుల్ లుక్.. కమలా రెడ్డిగా సర్‌ప్రైజ్

మంచు మనోజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డేవిడ్‌ రెడ్డి’. హనుమా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భరత్ మోతుకూరి, వెంకటరెడ్డి నల్లగంగుల నిర్మిస్తున్నారు. 1897 నుంచి 1920ల మధ్య బ్రిటిష్‌ కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరియా రియాబోషాప్కా కథానాయికగా నటిస్తుండగా.. సముద్రఖని, రమ్యకృష్ణ, అభయ్ డియోల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘డేవిడ్‌ రెడ్డి’ చిత్రబృందం ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె ‘కమలా రెడ్డి’ పాత్రలో కనిపించనున్నారు. పోస్టర్‌లో రమ్యకృష్ణ లుక్‌ పవర్‌ఫుల్‌గా ఉండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. కథలో ఆమె పాత్ర కీలకంగా ఉండబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

రమ్యకృష్ణ ఫస్ట్‌లుక్‌ ‘బాహుబలి’లోని శివగామి పాత్రను గుర్తు చేస్తోంది. అయితే ‘డేవిడ్‌ రెడ్డి’లో కమలా రెడ్డి పాత్ర మరింత భిన్నంగా, ప్రభావవంతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ద్వారా రమ్యకృష్ణ మరోసారి బలమైన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారనే అంచనాలు ఏర్పడ్డాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!