E-PAPER

EPFO కొత్త పోర్టల్.. పాత PF ఖాతాల్లోని డబ్బు ఇప్పుడు సులభంగా పొందొచ్చు!

ఉద్యోగాలు మారిన తర్వాత పాత ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలను మర్చిపోయే ఉద్యోగులకు శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పాత లేదా నిష్క్రియ PF ఖాతాలను గుర్తించి, వాటిలోని బ్యాలెన్స్‌ను తెలుసుకునేలా కొత్త డిజిటల్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవసరమైతే ఆ మొత్తాన్ని ప్రస్తుత PF ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం కూడా కల్పించింది.

ఉద్యోగ జీవితంలో పలుమార్లు సంస్థలు మారడం వల్ల చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ UANలు లేదా PF ఖాతాలు ఏర్పడుతుంటాయి. దీంతో పాత ఖాతాల్లోని నిధులు కొత్త ఖాతాలకు బదిలీ కాకుండా అలాగే ఉండిపోతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రూపొందించిన కొత్త పోర్టల్ ద్వారా పాత ఖాతాలను సులభంగా గుర్తించే అవకాశం లభించనుంది.

ఆధార్ ఆధారిత డిజిటల్ ధృవీకరణ పూర్తయిన తర్వాత అర్హత ఉన్న EPFO సభ్యులు తమ పాత PF ఖాతాల్లోని మొత్తాన్ని యాక్టివ్ UANకు బదిలీ చేసుకోవచ్చు. అవసరమైతే నిష్క్రియ ఖాతాల్లోని నిధులను క్లెయిమ్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉండటంతో లక్షలాది ఉద్యోగులకు ఇది ఉపయోగకరంగా మారనుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News