E-PAPER

భారత్‌లోకి రానున్న iQOO Z11 5G.. కొత్త డైమెన్సిటీ చిప్‌తో తొలి ఫోన్!

ఐక్యూ (iQOO) ఇటీవల iQOO Z11 Lite, iQOO Z11x 5G మోడళ్లను పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు తన Z సిరీస్‌ను మరింత విస్తరించేందుకు iQOO Z11 5Gను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. తాజా లీక్‌ల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టులో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ప్రాసెసర్‌తో రానున్న ఈ ఫోన్‌పై ఇప్పటికే టెక్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

లీకైన వివరాల ప్రకారం, భారత మార్కెట్‌లో విడుదలయ్యే iQOO Z11 5Gలో MediaTek Dimensity 7500 Turbo ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ కొత్త ఆక్టా-కోర్ చిప్‌తో భారతదేశంలో విడుదల కానున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. దీంతో పనితీరు, గేమింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే చైనాలో విడుదలైన iQOO Z11లో MediaTek Dimensity 8500 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. భారత్‌లో మాత్రం భిన్నమైన ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను తీసుకురానున్నట్లు లీకులు సూచిస్తున్నాయి. పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, అధికారిక విడుదల తేదీని కంపెనీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News