E-PAPER

Honor X7e Plus 5G విడుదల.. 8100mAh భారీ బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్

హానర్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Honor X7e Plus 5Gను అధికారికంగా విడుదల చేసింది. భారీ 8100mAh బ్యాటరీ, Snapdragon 4 Gen 4, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, అలాగే పలు AI ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఖతార్లో విడుదల కాగా, త్వరలో ఇతర మార్కెట్లలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర QAR 999, అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.26,000గా నిర్ణయించారు. Honor X7e Plus 5G మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది — డెసర్ట్ గోల్డ్, వెల్వెట్ బ్లాక్, మీటియోర్ సిల్వర్.

ఫోన్‌లో 6.87 అంగుళాల TFT LCD HD+ డిస్‌ప్లేను అందించారు. ఇది 1592 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 1020 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కంటి ఒత్తిడిని తగ్గించేందుకు Eye Comfort Mode ఫీచర్‌ను కూడా హానర్ అందించింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News