E-PAPER

ఆపిల్‌ వరల్డ్‌ వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!

ఆపిల్‌ వరల్డ్‌వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ (WWDC 2024) తేది టెక్ దిగ్గజం వెల్లడించింది. జూన్‌ 10 నుంచి నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది.

ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ WWDC లో ఆపిల్‌ సంస్థకు చెందిన అనేక ఆవిష్కరణలు సహా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

అయితే ఈ ఆపిల్‌ ఈవెంట్‌పైన భారీ అంచనాలు ఉన్నాయి. జనరేటివ్‌ AI పైన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. దీనిపై ఆపిల్ ఎప్పటి నుంచో పనిచేస్తోంది. మరియు ఈ విభాగంలో ఇటీవల కాలంలో నియామకాలను కూడా చేపట్టింది. డార్విన్‌ AI స్టార్టప్‌తో జతకట్టింది. ఫలితంగా దీనిపై ఆపిల్‌ సంస్థ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

 

ఈ వరల్‌వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌లో iOS 18, iPadOS 18, WatchOS అప్‌డేట్‌ సహా macOS లను ఆవిష్కరించే అవకాశం ఉంది. దీనిపై ఆపిల్‌ విడుదల చేసిన నోట్‌లో వీటిని ప్రస్తావించింది. దీంతోపాటు డెవలపర్లకు సాయం చేయడం సహా ఆపిల్‌ నిపుణులతో నేరుగా చర్చించే అవకాశం కలిగే అవకాశం ఉంది.

ఆపిల్‌ సంస్థ త్వరలో ఐఫోన్‌ 16 ను లాంచ్‌ చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్‌ కోసం GenAI ఫీచర్లను సొంతంగా అభివృద్ధి చేస్తోంది. దీంతోపాటు iOS 18 లో కీలక మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది. హోంస్క్రీన్‌ను కస్టమైజ్‌ చేసుకోవడం సహా Siri లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం ఆపిల్‌ ఈవెంట్‌లో విజన్‌ ప్రో హెడ్‌సెట్‌ను సంస్థ ఆవిష్కరించింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News