E-PAPER

రాజీవ్ యువ వికాసం పథకంకు సిబిల్ స్కోర్ నిబంధన ఎత్తి వేయాలి

సూర్యాపేట వై7 న్యూస్

తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పంతంగి వీరస్వామి గౌడ్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని ఖండించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సిబిల్ స్కోర్ నిబంధన వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బి సి, మైనారిటీ ఇబీసీ లలో ఉన్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు 6000 కోట్ల రూపాయలతో 5లక్షల మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయం చేసి దరఖాస్థులు స్వీకరించింది. ప్రభుత్వ నిర్ణయతో 16 లక్షల మంది నిరుద్యోగ యువత, నిరుపేదలు, దళితులు గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్థులు స్వీకారణ పూర్తి అయిన తరువాత సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం లబ్ధిదారుల నోట్లో మట్టికోట్టడమే అవుతుంది విమర్శించారు. అంబేద్కర్ అభయహస్తం పేరుతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి నిరుపేద దళితునికి 12 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీ రూపేనా ఇస్తామని అన్నారు ఇప్పటివరకు ఊసే లేదని, 1లక్ష నుండి 4లక్షల నిబంధనతో పేదల బతుకుల్లో ఇలాంటి మార్పు రాదని అన్నారు. కనీసం 10లక్షలు వరకు నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందిచలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధన ఎవ్వరి ప్రయోజనలకోసం. ప్రభుత్వం నిర్ణయం వలన అనేక మంది పేదలకు ఒక్కరికి కూడా రాజీవ్ యువ వికాసం రుణాలు వచ్చే అవకాశం లేదనీ అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సిబిల్ స్కోర్ నిబంధనను ఎత్తివేయాలని పేర్కొన్నారు. పత్రిక ప్రకటన ద్వారా పంతంగి వీరస్వామి గౌడ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ , జిల్లా గౌర సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, అయితే గాని మల్లయ్య గౌడ్, ఖమ్మం పార్టీ అంజయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, పట్టేటి కిరణ్, లింగారెడ్డి, సారగండ్ల కోటేష్, తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!