హుజూర్నగర్, సెప్టెంబర్ 18 వై సెవెన్ న్యూస్
హుజూర్నగర్ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో మంగళవారం హుజూర్నగర్ విశ్వబ్రాహ్మణ సంఘం కార్పెంటర్ సంఘం, స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవాన్ యొక్క ఫోటో కు పూలమాలతో అలంకరించి ఉదయం ఏడు గంటలకు స్వామివారికి అలంకరణ, అభిషేకం పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధతో హోమం నిర్వహించి, పూర్ణాహుతితో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో చేపూరి నరసింహ చారి, తాళ్లూరి హనుమ చారి,గోధురిబ్రహ్మచారి, దేశోజుఉపేంద్ర చారి, పెద్దోజుసూర్యనారాయణ, బంగారు బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 175









