(ఖమ్మం, నవంబర్ 12 – వై 7 తెలుగు న్యూస్)
ఖమ్మం నగరంలో ఈ నెల 14న నిర్వహించనున్న మెగా సినీ వల్లరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ నందు మెలోడీస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఖమ్మంలోని భక్త రామదాసు ప్రాంగణంలో నిర్వహించిన ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్ అలవాల నందు, ప్రముఖ సినీ, టీవీ, యూట్యూబ్ గాయకులు పాల్గొన్నారు.
ఈ నెల 14న ఖమ్మం నగరంలోని వర్తక సంఘం భవనంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెగా సినీ వల్లరి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ, టీవీ, యూట్యూబ్ సింగర్లు తమ గానంతో ప్రేక్షకులను అలరించనున్నారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పమ్మి రవి, ఆకుల గణపతి రాజు, ధావల్ సాహెబ్, మొగిలి వెంకటేశ్వర్లు, స్వరాజ్ కుటుంబరావు, ఫ్లూట్ పాషా, పక్రుద్దీన్, మిమిక్రీ భద్ర, గోవింద గురవయ్య, లక్కీ, విజయ, అజిత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. సంగీత ప్రియులు, కళాభిమానులు, ఖమ్మం నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మెగా సినీ వల్లరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.








