E-PAPER

తుఫాన్‌ దెబ్బకు జలదిగ్బంధంలో జగన్ కాలనీ

బాపట్ల: మురసు తుఫాన్ ప్రభావంతో బాపట్లలోని పాడిసన్ పేట లేఅవుట్ హైవే పక్కన ఉన్న జగన్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. కాలనీలోకి భారీగా వరద నీరు చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా, అత్యవసర పనులపై వెళ్లాలన్నా నీటిలోనే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. కాలనీలో నివసిస్తున్న ప్రజలు నీటిలో చిక్కుకుని అవస్థలు పడుతున్నప్పటికీ, ఇప్పటివరకు రాజకీయ నాయకులు గానీ, సంబంధిత ప్రభుత్వ అధికారులు గానీ కాలనీని సందర్శించి పరిస్థితిని పరిశీలించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరద నీటితో జీవనం దుర్భరంగా మారిందని, తమ సమస్యలను పట్టించుకునే వారు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీని సందర్శించి, వరద నీటిని తొలగించడంతో పాటు ప్రజలకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని జగన్ కాలనీ నివాసులు కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!