కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి.. గెలుపుపై శ్రేణుల ధీమా
శ్రీకాకుళం జిల్లా, పలాస | Y7 న్యూస్ తెలుగు
శ్రీకాకుళం జిల్లా మందస మండల జడ్పీటీసీ స్థానానికి కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా గజ్జి భవాని ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆమె కూటమి తరఫున నామినేషన్ దాఖలు చేశారు.
పలాస నియోజకవర్గ టీడీపీ యూత్ లీడర్ ముడిమించి నవీన్ యాదవ్ సతీమణి అయిన గజ్జి భవానికి, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మద్దతు లభించడంతో కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు సమాచారం.
మందస జడ్పీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా గజ్జి భవానిని ఎంపిక చేయడంపై కూటమి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పార్టీకి ఉన్న మద్దతు, కూటమి శ్రేణుల సమన్వయంతో విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మందస మండలంలో జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గజ్జి భవాని అభ్యర్థిత్వం ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
— Y7 న్యూస్ తెలుగు | పలాస








