E-PAPER

లెనిన్ హిట్ అయినా.. భాగ్యశ్రీకి ఛాన్సులు కరువు!

భాగ్యశ్రీ బోర్సే తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లామర్‌తో పాటు నటనతో ఆకట్టుకున్న ఆమెకు గతంలో వరుస అవకాశాలు వచ్చినా, ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఆమె పేరు పెద్దగా వినిపించడం లేదు. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో పాటు ఆమె నటనకు ప్రశంసలు దక్కినా, కొత్త తెలుగు ప్రాజెక్ట్ మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు.

ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో తమిళ చిత్రం ‘సేయాన్’ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ‘లెనిన్’ తర్వాత కూడా అవకాశాలు రాకపోవడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయా? లేక కథ, పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కీలకంగా మారింది.

అయితే భాగ్యశ్రీ మాత్రం తొందరపడకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘లెనిన్’ తర్వాత కూడా మంచి ప్రాజెక్ట్ కోసం ఆమె వేచి చూస్తున్నారని, త్వరలోనే ఓ క్రేజీ తెలుగు సినిమాతో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ గ్యాప్‌కు ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!